
India - Pakistan: పాక్‌కు అమెరికా సూచన.. భారత్‌తో తక్షణం చర్చలు జరపండి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌తో ఉత్కంఠతలను తగ్గించేందుకు చర్చలు జరపాలని అమెరికా సూచించింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు.
భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ సంభాషణ జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని, రూబియో పాక్‌కు సూచించారు. అవసరమైతే ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తామని కూడా ఆయన సూచించారు.
Details
మంత్రితో జైశంకర్ తో మాట్లాడిన రుబియో
మరింతగా ఇటీవల రూబియో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమయంలో, ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించబోమని రూబియో స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, జీ7 దేశాలు కూడా భారత్-పాక్‌లకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చాయి. పహల్గామా ఉగ్రదాడిని వారు తీవ్రంగా ఖండించారు.
ఇరుదేశాల మధ్య భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతి సాధన కోసం చర్చలు జరపాలని ప్రతిపాదించారు.