
బైడెన్ కాన్వాయ్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘించిన డ్రైవర్.. యూఏఈ అధ్యక్షుడు బస చేసే హోటల్‌లోకి వెళ్లి..
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో కొద్దిసేపు ప్రశ్నించారు. అనంతరం అతడిని విడిచిపెట్టారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ కాన్వాయ్‌కు చెందిన వాహనం ఒకటి యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయేద్ బస చేసిన తాజ్ హోటల్‌లోకి ప్రవేశించింది.
ఈ మేరకు డ్రైవర్‌ను సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను బైడెన్ బస చేసిన ఐటీసీ మౌర్యకు వెళ్లాలని, లోధి ఎస్టేట్ కు చెందిన వ్యాపారవేత్తను దిగబెట్టేందుకే ఇక్కడికి వచ్చానన్నారు.
ఈ ఘటనపై నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు. ఉబర్, ఓలా క్యాబ్ వియోగిస్తున్నారా అని నెటిజన్లు వ్యంగంగా స్పందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెటిజన్ ఫన్నీ కామెంట్
Are they using @uber_india and @Olacabs?#G20India2023 #G20India #G20SummitDelhi https://t.co/B95wGAOLBx
— Asheesh Sabarwal (@AsheeshSabarwal) September 10, 2023