Usman Sagar Project: వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తివేత
తెలంగాణలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో జలశాయాల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు నిండిపోయాయి. వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్ నగర్, షాబాద్ నుంచి జలశాయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.
ఉస్మాన్ సాగర్ కి 1100 క్యూసెక్కుల వరద నీరు
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయానికి చెందిన రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ రెండు గేట్ల ద్వారానే 700 క్యూసెక్కల నీరును కిందకు రిలీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు. ముఖ్యంగా హియాయత్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మూసీ నది ప్రవాహం పెరుగుతోంది. ఇక ఉస్మాన్ సాగర్ లో 1100 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1784.70 అడుగులకు చేరింది. మరో వైపు హిమాయత్ సాగర్‌కు 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1761.20 అడుగులుగా ఉంది.