
Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక విషయంపై అధిష్టానంతో చర్చించేందుకు సోమవారం సాయంత్రం భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్లీ చేరుకున్నారు.
వీరిద్దరూ మంగళవారం పలువురు సీనియర్ లీడర్లను కలిసినట్లు సమాచారం.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్ తో ఉత్తమ్ మధ్యాహ్నం భేటీ అయ్యారు.
ఈ రోజు సీఎం అభ్యర్ద్విత్వం పై దాదాపు గంటన్నర పాటు చర్చించారు.
మీటింగ్ తరువాత బయటకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా తో మాట్లాడారు.
ఎమ్మేల్యే కావాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి.. ఆ ప్రక్రియను అనుసరిస్తాను అని తెలిపారు.
సీఎంగా ఎవరి పేరు ఖరారు చేసారని మీడియా ప్రశ్నించగా .. నో కామెంట్ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy in Delhi says "I have to resign as MP to become an MLA. I will follow the process"
— Aakashavani360 (@aakashavani360) December 5, 2023
Interesting statement #Telangana #TelanganaElections2023#Congress
pic.twitter.com/sNVTdUOhLM