NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttar Pradesh: ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. యూపీలో ప్రధాన సూత్రధారి ఎన్‌కౌంటర్‌
    తదుపరి వార్తా కథనం
    Uttar Pradesh: ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. యూపీలో ప్రధాన సూత్రధారి ఎన్‌కౌంటర్‌
    ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. యూపీలో ప్రధాన సూత్రధారి ఎన్‌కౌంటర్‌

    Uttar Pradesh: ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. యూపీలో ప్రధాన సూత్రధారి ఎన్‌కౌంటర్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 24, 2024
    10:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో జరిగిన పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఓ మద్యం స్మగ్లర్ మృతిచెందాడు.

    పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, గత నెలలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సభ్యుల హత్యలో సంబంధం ఉన్న మద్యం స్మగ్లర్ ఒకరు మళ్లీ అక్రమ మద్యం రవాణాకు ప్రయత్నిస్తున్నాడని సోమవారం రాత్రి సమాచారం అందింది.

    దీంతో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) నోయిడా యూనిట్, స్థానిక ఘాజీపుర్ పోలీసులు కలిసి ఆపరేషన్ నిర్వహించారు.

    అర్థరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడు మహ్మద్ జాహిద్ (అలియాస్ సోనూ) ఇతర పోలీసు సిబ్బందికి గాయాలు జరిగాయి.

    గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికీ, మంగళవారం తెల్లవారుజామున నిందితుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

    వివరాలు 

    ఎన్‌కౌంటర్లలో ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు

    ఆగస్టు 20న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుళ్లు జావేద్ ఖాన్,ప్రమోద్ కుమార్ బార్మర్ గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు, మద్యం స్మగ్లర్లు వారిపై పాశ్విక దాడి చేశారు.

    ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు, ఆ తరువాత పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో, యూపీలో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఆగస్టు 19, 20 తేదీల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

    సుల్తాన్‌పుర్ నగల దుకాణం దోపిడీ కేసులో, రెండో నిందితుడిని సోమవారం తెల్లవారుజామున యూపీ పోలీసులు ఎదురుకాల్పుల్లో క్షతగాత్రంగా పేల్చారు.

    ఆ నిందితుడిని ఆసుపత్రికి తరలించినప్పుడు, ఆయన మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

    వివరాలు 

    సెప్టెంబర్ 5న మంగేశ్ యాదవ్‌ ఎన్‌కౌంటర్‌ 

    సుల్తాన్‌పుర్‌లోని భారత్ జ్యువెలర్స్ దుకాణం నుంచి ఆగస్టు 28న సుమారు రూ.1.5 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకుపోయిన విషయం తెలిసిందే.

    ఈ కేసులో మంగేశ్ యాదవ్‌ను సెప్టెంబర్ 5న ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు

    ఉత్తర్‌ప్రదేశ్

    prayagraj: ప్రయాగ్‌రాజ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఢిల్లీ-హౌరా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం రైలు ప్రమాదం
    Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 27 మంది మృతి  భారతదేశం
    Bhole Baba: హత్రాస్ తొక్కిసలాటలో 116 మందికి పైగా మృతి.. ఘటన తర్వాత భోలే బాబా పరార్..   భారతదేశం
    Hathras : పవిత్ర జలం పేరుతో భక్తులకు నీళ్లు ప్రసాదం..ఎగబడి ప్రాణాలు కోల్పోయిన 116 మంది.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025