By-elections: ఉత్తరప్రదేశ్, కేరళ,పంజాబ్‌లలో ఉప ఎన్నికలు వాయిదా..
ఎన్నికల సంఘం ఉప ఎన్నికల తేదీలపై కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత నవంబర్ 13న జరగాల్సిన కేరళ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ (యూపీ)లోని ఉప ఎన్నికలను నవంబర్ 20కి వాయిదా వేసింది. ఈ నిర్ణయం వివిధ పండుగల కారణంగా ఓటింగ్‌కు ఎక్కువ మంది హాజరయ్యేలా చేయడమే లక్ష్యంగా తీసుకుంది. కాంగ్రెస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు ఈ నెల 13న జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ పండుగల సమయంలో ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియజేశాయి. ఈకమిషన్ దానిపై స్పందించి తాజా ప్రకటనను విడుదల చేసింది.
కార్తీక పూర్ణిమ సందర్భంగా ఓటింగ్‌కు తగ్గే అవకాశం
యూపీ ఉప ఎన్నికల తేదీలను మార్చాలని బీజేపీ ఇటీవల ఎన్నికల సంఘానికి మెమోరాండం ఇచ్చింది. కార్తీక పూర్ణిమ నవంబర్ 15న జరుగుతున్న నేపథ్యంలో కుందర్కి, మీరాపూర్, ఘజియాబాద్, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాల్లో ప్రజలు ముందుగా సంబరాల్లో పాల్గొంటారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తేదీలను మార్చాలని బీజేపీ కోరింది. దీని ప్రకారం, నవంబర్ 13కు బదులుగా నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించేందుకు ఈకమిషన్ అంగీకరించింది.