తదుపరి వార్తా కథనం

Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సీఐడీ కోర్టు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 27, 2025
04:51 pm
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.
వంశీకి బెయిల్ ఇవ్వకూడదని,అతను బయటకు వచ్చినట్లయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని సీఐడీ తన వాదనను సమర్పించింది.
అదే సమయంలో,వంశీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని,మానవతా దృష్టికోణంలో బెయిల్ మంజూరు చేయాలని ఆయన న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.
ఈ నేపథ్యంలో,తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి,తాజాగా తుది తీర్పును ప్రకటించారు.
వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు,అదే కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురి బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించారు.