తదుపరి వార్తా కథనం
Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి మూడు రోజుల కస్టడీ.. ఏం జరుగుతోంది?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 27, 2025
03:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల కస్టడీ ముగిసింది.
కోర్టు అనుమతితో మూడ్రోజుల పాటు కస్టడీలో ఉన్న వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో పటమట పోలీసులు విచారించారు.
చివరి రోజు విచారణ పూర్తయిన అనంతరం వంశీని విజయవాడ జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు .
వంశీతో పాటు ఇంకా ఇద్దరు నిందితులు - లక్ష్మీపతి, శివరామకృష్ణలను పోలీసులు విచారించారు.
Details
మరోసారి విచారించే ఆలోచనలో పోలీసులు
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వారి ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. వంశీ చెప్పడంతోనే సత్యవర్ధన్‌ను తీసుకెళ్లినట్లు మిగతా నిందితులు అంగీకరించినట్లు సమాచారం.
అయితే, తనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని వంశీ పోలీసుల విచారణలో పదేపదే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మరోసారి వంశీని కస్టడీలోకి తీసుకుని విచారించాలనే ఆలోచనలో పోలీసులున్నారు.