తదుపరి వార్తా కథనం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మళ్లీ అస్వస్థత.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 07, 2025
04:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవడంతో ఆయనను కుటుంబ సభ్యులు అత్యవసరంగా విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.