రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్లీపర్ కోచ్‌లతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ముస్తాబు
రైల్వే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే వందే భారత్ స్లీపర్ కోచ్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే కొత్త బోగీలను తీసుకురానున్నట్లు ఇంటెగ్రిల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) జీఎం బీజీ మాల్యా ప్రకటించారు. ప్రస్తుతం కోచ్‌లు ఉత్పత్తి దశలో ఉన్నాయని, మార్చిలో వీటిని పట్టాలెక్కిస్తామన్నారు.ఫలితంగా సుదూర ప్రాంతాలకు అత్యంత వేగంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. తక్కువ దూర ప్రయాణం కోసం 12 కోచ్‌లతో వందేభారత్ మెట్రో రైళ్లను 2024 జనవరిలో తీసుకురానున్నారు. 2 కోచ్‌లతో నాన్ ఏసీ పుష్‌పుల్ రైలునూ ప్రవేశపెడుతున్నామని, అక్టోబరు 31న అందుబాటులోకి వస్తాయన్నారు. దిల్లీ-వారణాసి మధ్య తొలి వందేభారత్ రైలును 2019, ఫిబ్రవరి 15న ప్రధాని ప్రారంభించారు.