LOADING...
జ్ఞానవాపి మసీదులో కీలక పరిణామం.. శాస్త్రీయ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్
శాస్త్రీయ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్

జ్ఞానవాపి మసీదులో కీలక పరిణామం.. శాస్త్రీయ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 21, 2023
06:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వే చేసేందుకు వారణాసి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి పక్కనే ఉన్న మసీదులో సైంటిఫిక్ సర్వే చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు విచారించిన వారణాసి కోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతలకు పూజలు చేసుకునేందుకు అనుమతివ్వాలని గతంలోనే హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు సదరు ప్రార్థనా స్థలంలో వీడియోగ్రఫీ సర్వేకు కోర్టు అప్పట్లోనే ఆదేశించింది. సర్వే కొనసాగుతున్న క్రమంలో శివలింగం కనిపించిందని హిందూ వర్గం పిటిషన్‌పై వారణాసి కోర్టు స్పందించింది.

DETAILS

ASIతో సర్వే చేయించాలని పిటిషన్ దాఖలు

సదరు ప్రదేశాన్ని సీల్‌ చేసి, సీఆర్పీఎఫ్‌ భద్రతా నీడలో ఉంచాలని వారణాసి కోర్టు ఉత్తర్వులిచ్చింది. అనంతరం ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. మసీదులో శివలింగం కనిపించిదన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ అంశంపై వారణాసి కోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలోనే హిందూ భక్తులు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. మసీదు ప్రాంగణమంతా ASIతో సర్వే చేయించాలని కోరారు. ఇలాంటి సర్వేలతో మసీదు ధ్వంసమయ్యే అవకాశాలున్నాయని ముస్లిం ప్రతినిధుల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వాజూ ఖానా ప్రాంతం మినహా మిగతా ప్రాంగణమంతా సైంటిఫిక్ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శాస్త్రీయ సర్వేకు వారణాసి కోర్టు గ్రీన్ సిగ్నల్