Varun Gandhi: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వరుణ్ గాంధీ
బీజేపీ నేత,ఎంపీ వరుణ్ గాంధీ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొంతకాలంగా పార్టీ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న వరుణ్ గాంధీకి ఈ ఎన్నికలలో బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీ వరుణ్ కి టికెట్ నిరాకరిస్తే.. అయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని విశ్వనీయ వర్గాలు బుధవారం తెలిపాయి. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ స్థానానికి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అయన ప్రతినిధులు ఢిల్లీ నుంచి యూపీకి ఇప్పటికే తీసుకొచ్చారని తెలిపాయి.