LOADING...
M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత 
ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత

M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్ (ఎం.ఆర్. శ్రీనివాసన్) ఇవాళ కన్నుమూశారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. దేశీయ అణ్వాయుధ కార్యక్రమ రూపకల్పనలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ హోమీ భాబాతో కలిసి శ్రీనివాసన్ పనిచేశారు. ఆయనకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్‌ ను ప్రదానం చేసింది. శ్రీనివాసన్ మృతిపట్ల ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. తమిళనాడులోని ఉదగమండలం జిల్లాకు చెందిన కలెక్టర్ లక్ష్మీ భవ్య ఆయనకు పుష్పాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత