LOADING...
Andhrapradesh: ఏపీలోని పలు వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకం.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన గవర్నర్‌ 
ఏపీలోని పలు వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకం.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన గవర్నర్‌

Andhrapradesh: ఏపీలోని పలు వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకం.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన గవర్నర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ సి.ఎస్‌.ఆర్‌.కె. ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వరంగల్ నిట్‌లో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ పి. ప్రకాశ్‌బాబు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో బయోటెక్నాలజీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. వీరు మూడేళ్ల పాటు ఆయా విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా కొనసాగనున్నారు.

వివరాలు 

విశ్వవిద్యాలయాలు - కొత్త వైస్ ఛాన్సలర్లు 

రాయలసీమ విశ్వవిద్యాలయం - వెంకట బసవరావు అనంతపురం జేఎన్టీయూ - హెచ్. సుదర్శనరావు తిరుమల పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం - ఉమ మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం - కె. రాంజీ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం - ప్రసన్న శ్రీ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం - అల్లం శ్రీనివాసరావు