Vijay: Rammohan Naidu: ఏటీఎఫ్‌పై వ్యాట్ తగ్గింపు.. సీఎం విజయ్ నిర్ణయాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విమానయాన రంగానికి మేలు చేసే నిర్ణయం తీసుకున్నందుకు ఆయనను అభినందించారు. ఈ మేరకు రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్‌తో పాటు విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇంధన ఖర్చులు పెరగడంతో విమానయాన సంస్థలు టికెట్ ధరలను పెంచే అవకాశం ఉంది. దీనివల్ల విమాన ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
వివరాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇలాంటి సమన్వయం ఎంతో అవసరం: రామ్మోహన్ నాయుడు
ఈ పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం ఏటీఎఫ్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను గణనీయంగా తగ్గించింది. విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రామ్మోహన్ నాయుడు స్వాగతించారు.
సీఎం విజయ్ చొరవను ప్రత్యేకంగా ప్రశంసించారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించిన రామ్మోహన్ నాయుడు.. విమానయాన రంగానికి ఇది ప్రయోజనకరమైన చర్య అని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం తీసుకున్నందుకు విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
విమాన ప్రయాణాలు ప్రజలకు భారంగా మారకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇలాంటి సమన్వయం ఎంతో అవసరమని చెప్పారు.
ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన ట్వీట్
Appreciate the Tamil Nadu Government’s decision to reduce VAT on Aviation Turbine Fuel (ATF), a welcome step for the aviation sector. Thank you to Hon’ble Chief Minister Thiru @TVKVijayHQ for this initiative.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) October 23, 2026
Making air travel more affordable requires the Centre and States to… pic.twitter.com/J6UgCRz5L1