Vijaya Shanthi : 'రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి విజయశాంతి.. ఈసారి కాంగ్రెస్ సర్కారు వచ్చేనా'
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ స్టార్ సినీ పొలిటికల్ లీడర్ విజయశాంతి బుధవారం బీజేపీకి గుడ్ బై చెప్పేశారు.
ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు.
గత కొన్ని రోజులుగా విజయశాంతి పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవి విజయశాంతి పార్టీ మార్పుపై ప్రకటన చేశారు. రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డికి పంపించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన రోజున తెలంగాణ బీజేపీకి విజయశాంతి రాంరాం చెప్పేశారు.
తెలంగాణ కోసం కేసీఆర్ తో పనిచేసిన విజయశాంతి, తర్వాత కాంగ్రెస్, అనంతరం బీజేపీలో చేరారు.
Details
మరోసారి కాంగ్రెస్ గూటికే రాములమ్మ
మరోవైపు తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుందని రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ విజయశాంతి మరోసారి కాంగ్రెస్ గూటికే చేరనున్నారు.
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి కీలక నేతలు కాషాయదళాన్ని వీడారు.
ఈ మేరకు తాజాగా విజయశాంతి సైతం అదే దారిలో నడుస్తుండటం గమనార్హం.ఈ సందర్భంగానే కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు.
గత కొంత కాలంగా బీజేపీలో విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు.
ఈసారి ఎలాగైనా కేసీఆర్ సర్కారును గద్దె దించాలన్న కసి రాములమ్మలో కనిపిస్తోంది. గతంలోనూ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా పనిచేసిన విజయశాంతి, కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ప్రచారం చేయడం గమనార్హం.