LOADING...
Vijayashanti: కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ 
Vijayashanti: కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర కామెంట్స్

Vijayashanti: కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
Dec 05, 2023
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. గజ్వేల్ లో గెలిచిన కేసీఆర్.. కామారెడ్డిలో మాత్రం ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ఓటమి పాలవడంపై కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్, తాను ఇద్దరమే ఎంపీలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామన్నారు. తమ మధ్య ఎన్ని విధానపరమైన వ్యతిరేకతలు ఉన్నా.. అన్నా అని పిలిచిచానని, ఆయనపై గౌరవంతో పని చేసినట్లు విజయశాంతి అన్నారు. నేడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం మాత్రమే కాకుండా.. రాష్ట్రంలో బీఆర్ఎస్ దీన స్థితిలో కనిపించడం బాధాకరం అని విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హూందాతనాన్ని, గౌరవాన్ని కేసీఆర్ నుంచి తెలంగాణ సమాజం ఆశిస్తోందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విజయశాంతి ట్వీట్