LOADING...
Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. రేపు చేరిక 
Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. రేపు చేరిక

Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. రేపు చేరిక 

వ్రాసిన వారు Stalin
Nov 11, 2023
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమె కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా ఆమె హాజరుకావడం లేదు. ప్రధాని మోదీ, అమిత్ షా సభలకు కూడా విజయశాంతి దూరంగా ఉండటంతో.. ఆమె బీజేపీని వీడే యోచనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ విజయశాంతి ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు. కానీ విజయశాంతి ఇప్పుడు నిజంగా బీజేపీని వీడే సమయం ఆసన్నమైంది. ఆమె త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆమె కాంగ్రెస్‌లో చేరే విషయాన్ని పార్టీ సీనియర్ నేత మల్లు రవి ధృవీకరించారు. త్వరలో ఆమె కాంగ్రెస్‌లోకి వస్తారని, ప్రచార కమిటీలో భాగస్వామ్యం అవుతారని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొంతకాలంగా బీజేపీకి దూరంగా విజయశాంతి