Page Loader
చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. ఏసీబీ కోర్టులో హౌస్‌ కస్టడి పిటిషన్‌ కొట్టివేత
ఏసీబీ కోర్టులో హౌస్‌ కస్టడి పిటిషన్‌ కొట్టివేత

చంద్రబాబుకు ఎదురుదెబ్బ.. ఏసీబీ కోర్టులో హౌస్‌ కస్టడి పిటిషన్‌ కొట్టివేత

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 12, 2023
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. భద్రతా కారణాల రీత్యా హౌస్‌ రిమాండ్‌లో ఉంచాలని బాబు తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. భద్రతపై చంద్రబాబు లాయర్ల వాదనతో ఏకీభవించని కోర్టు, రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ముప్పులేదన్న సీఐడీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఇదే క్రమంలో బాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్‌ వేసింది. దీంతో వాదనలు రేపటికి వాయిదా పడింది. మరోవైపు సీఐడీ పిటిషన్ పై రేపు కౌంటర్‌ దాఖలు చేస్తామని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏసీబీ కోర్టులో హౌస్‌ కస్టడి పిటిషన్‌ కొట్టివేత