Lok Sabha-Elections-AI-Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల్లో పార్టీలకు ఏఐ సెగ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సాయంతో ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు ఆడియోలు లోక్ సభ ఎన్నికల్లో కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చెందిన ఆడియో క్లిప్(Audio Clip) ఒకటి వైరల్ అవుతుంది. ఆయన భారత దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు అందులో వినిపిస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోట దృశ్యాలను జత చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విపరీతంగా వైరల్ చేస్తున్నాయి. త్వరలోనే ఈరోజు రానుంది అంటూ దానికి ఆడియోలు జత చేశారు. అయితే ఈ ఆడియో క్లిప్ లో పరిశీలించగా డిటెక్షన్ టూల్స్ ఏఐ వాయిస్ క్లోన్ గా నిర్ధారించాయి.
చర్యలు తీసుకుంటాం: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
ఇదిలా ఉండగా కొందరు సినిమా ప్రముఖులు రాజకీయపార్టీల తరఫున ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇట్లాంటి వీడియోలు బయటకు రావడం ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సార్వత్రిక ఎన్నికల ముగిసిన వెంటనే చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.