Page Loader
Cyclone Fengal: ఫెయింజల్‌ తుపాను వల్ల విశాఖ-తిరుపతి, విశాఖ-చెన్నై విమానాలు రద్దు
ఫెయింజల్‌ తుపాను వల్ల విశాఖ-తిరుపతి, విశాఖ-చెన్నై విమానాలు రద్దు

Cyclone Fengal: ఫెయింజల్‌ తుపాను వల్ల విశాఖ-తిరుపతి, విశాఖ-చెన్నై విమానాలు రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2024
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫెయింజల్‌ తుపాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విశాఖ నుంచి అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా విశాఖ-తిరుపతి విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు. చెన్నైలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో విశాఖ-చెన్నై విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.