
పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దిల్లీలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు.
హస్త కళాకారులు, చేతివృత్తిదారులకు రూ. 2 లక్షల మేర సబ్సిడీతో కూడిన రుణాన్ని అందించడమే ఈ పథకం ఉద్దేశం.
తొలి విడతగా రూ.లక్ష, మరో విడతగా రూ.2 లక్షల రుణాన్ని అందించనున్నారు. ఐదేళ్ల కాలానికి రూ.13 వేల కోట్లు నిధులు ఈ పథకం కోసం కేటాయించారు.
చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ, క్షవరం లాంటి వృత్తిదారులకు ప్రయోజనం అందనుంది.
దాదాపు 30 లక్షల మందికి వర్తించనున్న ఈ పథకంలో వడ్డీ కేవలం 5 శాతంగానే ఉంటుంది.
విశ్వకర్మగా గుర్తింపు పొందాలంటే మాత్రం గుర్తింపు పత్రం, ఐడీ కార్డుని కేంద్రం జారీ చేస్తుంది.
details
శిక్షణ కోసం విశ్వకర్మ పథకంలో నమోదు చేసుకోండి : కేంద్రం
విశ్వకర్మ పథకంలో భాగంగా హస్త కళాకారులు, తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు స్కిల్ అప్ గ్రేడేషన్ ఫెసిలిటీ లభిస్తుంది. టూల్ కిట్ ప్రొత్సాహతాలను సైతం పొందొచ్చు.
ఈ పథకంలో భాగంగా రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో బేసిక్, అడ్వాన్స్డ్ అనేవి రెండు ఉంటాయి.
వీటిల్లో శిక్షణ కాలంలో లబ్ధిదారులకు రోజుకు రూ.500 చొప్పున స్టైఫండ్ అందిస్తారు. ఆధునిక పరికరాల కొనుగోలు కోసం రూ. 15 వేల వరకు గ్రాంట్ లభిస్తుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15 రోజుల అధునాతన శిక్షణ కోసం విశ్వకర్మ పథకంలో నమోదు చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.