తదుపరి వార్తా కథనం
Telangana: సియోల్‌లో తెలంగాణ మంత్రుల పర్యటన.. నీటి వనరుల ప్రాజెక్టులపై దృష్టి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 22, 2024
10:13 am
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది.
దక్షిణ కొరియాలోని ముఖ్యమైన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ను మంత్రులు, అధికారుల బృందాలు పరిశీలించాయి.
సియోల్ నగరంలో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు ఈ నది కీలకంగా మారింది. కాలుష్యానికి గురైన హన్ నదిని శుభ్రపరిచి దక్షిణ కొరియా ప్రభుత్వం పునరుద్ధరించింది.
Details
హన్ నదిని పరిశీలించిన మంత్రుల బృందం
మొత్తం 494 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ నది.. సియోల్ నగరంలో 40 కి.మీ. మేర ప్రవహిస్తోంది.
ప్రక్షాళన తర్వాత శుభ్రంగా మారి, ఇప్పుడు సియోల్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం, జలవనరుగా మారింది.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఈ నదిని పరిశీలించారు.