ఫోన్లో హైజాక్ అని అరిచిన వ్యక్తి అరెస్ట్.. లేట్ గా బయల్దేరిన విమానం
ఈ వార్తాకథనం ఏంటి
ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఫ్లైట్ హైజాక్ అంటూ మాట్లాడిన మాటలతో ఏకంగా టేక్ అయ్యే విమానం ఆగిపోయింది. ఈ మేరకు సదరు విమానం 4 గంటలు ఆలస్యంగా బయల్దేరింది.
ముంబై నుంచి దిల్లీ వెళ్లే విస్తారా ఎయిర్ లైన్స్ విమానం ఫ్లయింగ్ కు రెఢీ అయ్యింది.
ఈ క్రమంలో టేకాఫ్ తీసుకునే క్రమంలో ఓ ప్రయాణికుడు ఫోన్ లో హైజాక్ హైజాక్ అంటూ అరిచాడు.
ఈ సంఘటనతో విమానంలోని ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. అనంతరం ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు.
హైజాక్ అని అరిచిన వ్యక్తిని రితేష్ సంజయ్ కుమార్ జునేజాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఫ్లైట్ లోని ప్రయాణికులందరినీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మేరకు కిందకు దించేశారు.
DETAILS
మానసిక రుగ్మతతోనే వ్యక్తి అరిచాడు: పోలీసులు
అనంతరం విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 6.30 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ షెడ్యూల్డ్ కాస్త మారిపోయింది. ఈ క్రమంలో రాత్రి 10.30 గంటలకు టేకాఫ్ అయింది.
విస్తారా ఫ్లయిట్ యూకే 996లో ఓ ప్రయాణికుడు వికృతంగా ప్రవర్తించిన కారణంగానే విమానం ప్రయాణం ఆలస్యమైందని విస్తారా ఎయిర్ లైన్స్ ప్రతినిధి వెల్లడించారు.
సదరు వ్యక్తికి మానసికంగా బాగాలేడని, అనారోగ్యం ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. నిలకడ లేని వ్యక్తిత్వంతోనే అరిచాడని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
హైజాక్ అంటూ చేసిన బెదిరింపుల వల్ల ప్రయాణికులందరితో పాటు లగేజీని మరోసారి తనిఖీ చేయాల్సి వచ్చిందని వివరించారు.