Rajyasabha: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర కరెన్సీ నోట్లు.. సభ్యుల ఆందోళన
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 06, 2024
11:59 am
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలంపై ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. గురువారం జరిగిన సమావేశంలో, కాంగ్రెస్ సభ్యుడి కుర్చీ వద్ద కరెన్సీ నోట్లను గుర్తించారు. ఈ అంశంపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ, నోట్లపై ఆరోపణలు ఉన్నాయనీ, అందుకు సంబంధించిన విచారణ ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ఈ విచారణకు ఎలాంటి అభ్యంతరమూ లేవని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి, రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగింది అని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శించారు.