LOADING...
Warangal: వరంగల్ జిల్లాలో యూరియా కోసం ఎదురుచూపులు
వరంగల్ జిల్లాలో యూరియా కోసం ఎదురుచూపులు

Warangal: వరంగల్ జిల్లాలో యూరియా కోసం ఎదురుచూపులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూరియా కొరత పరిస్థితిని ప్రతిబింబించే దృశ్యమే ఇది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ఆదివారం తెల్లవారుజామునే రైతులు, మహిళలు నల్లబెల్లి సహకార సంఘం కార్యాలయం ఎదుట బారులు తీరారు. మొత్తం 440 మంది రైతులు అక్కడకు చేరుకోగా, ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున 880 బస్తాల యూరియా పంపిణీ చేశామని వ్యవసాయాధికారి రజిత తెలిపారు. రైతులు ఉదయాన్నే వస్తుండటంతో, సహకార సంఘ సిబ్బంది సహకారంతో ఉదయం 8 గంటల లోపే యూరియా బస్తాల పంపిణీ పూర్తిచేయడానికీ చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు. ఇదే సమయంలో దుగ్గొండి మండలంలోని సహకార సంఘం వద్ద కూడా భారీ సంఖ్యలో రైతులు రావడంతో అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.