
Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుపై కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు.. జేపీసీకి బిల్లుపై 96 లక్షల విజ్ఞప్తులు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగించారు.
ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాతనే దీన్ని తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు.
ఈ బిల్లును ప్రవేశపెట్టకపోతే,పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే పరిస్థితి వచ్చివచ్చిందని ఆయన అన్నారు.
''ఈ బిల్లుకు సంబంధించిన విషయంలో విపక్షాలు అసత్య ప్రచారం చేశాయి.ఇందులోని అంశాలను అపార్థం చేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.
1954లో వక్ఫ్ చట్టం మొదటిసారిగా అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో అది అప్రజాస్వామికమని ఎవరూ చెప్పలేదు,''అని రిజిజు విపక్షాలను విమర్శించారు.
జేపీసీకి ఈ బిల్లుపై 96 లక్షల విజ్ఞప్తులు అందాయి అని వివరించారు.
వివరాలు
యూపీఏ హయాంలో ఢిల్లీలోని కీలక స్థలాలు వక్ఫ్ సొంతం
ఈ సవరణ బిల్లుతో ముస్లిం సమాజానికి ఎలాంటి నష్టం కలగదని స్పష్టం చేశారు.
వక్ఫ్ చట్ట సవరణలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
యూపీఏ హయాంలో ఉంటే ఢిల్లీలోని కీలక స్థలాలు వక్ఫ్ సొంతమయ్యేవని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విలువైన ప్రభుత్వ భూములను వక్ఫ్‌కు అప్పగించారని మండిపడ్డారు.
ఇక మసీదుల నిర్వహణపై ఈ చట్టం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
బిల్లుకు ఆమోదం కోసం అవసరమైన సంఖ్యాబలం 272 కాగా, ఎన్డీఏ వద్ద 298 మంది సభ్యులు ఉన్నారు. విపక్ష పార్టీల బలం 233 కాగా, ఇతర సభ్యులు 11 మంది ఉన్నారు.