Page Loader
Veena George: 'సహాయక చర్య కోసం కువైట్‌కు వెళ్లేందుకు అనుమతించలేదు...': కేరళ మంత్రి
'సహాయక చర్య కోసం కువైట్‌కు వెళ్లేందుకు అనుమతించలేదు...': కేరళ మంత్రి

Veena George: 'సహాయక చర్య కోసం కువైట్‌కు వెళ్లేందుకు అనుమతించలేదు...': కేరళ మంత్రి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2024
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తనను కువైట్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. కువైట్‌లోని ఒక భవనంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో బాధిత కేరళీయులకు సహాయక చర్యలను సమన్వయం చేయడం ఈ పర్యటన ఉద్దేశమని జార్జ్ చెప్పారు. జార్జ్ గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ, "కువైట్ వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతికోరినా మాకు అనుమతి ఇవ్వలేదు'' అని ఆమె పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంలో 40 మంది భారతీయులు సహా 49మంది మరణించారు.ఈ 40 మంది భారతీయుల్లో 23 మంది కేరళకు చెందిన వారే. క్షతగాత్రులకు చికిత్స చేయడం,మృతుల మృతదేహాలను స్వదేశానికి తరలించడం వంటి సహాయ కార్యక్రమాల్లో సహాయం చేసేందుకు జార్జ్‌ను కువైట్‌కు పంపాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న వీణా  జార్జ్