LOADING...
Handreeneeva: హంద్రీ-నీవా కాలువకు 6 పంపుల ద్వారా జలాలు
హంద్రీ-నీవా కాలువకు 6 పంపుల ద్వారా జలాలు

Handreeneeva: హంద్రీ-నీవా కాలువకు 6 పంపుల ద్వారా జలాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మండలంలోని మల్యాల వద్ద ఉన్న హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి ఆదివారం మొత్తం ఆరు పంపుల సహాయంతో కాలువకు నీరు ఎత్తిపోస్తున్నారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. ఆ తరువాతి రోజుతో ప్రారంభమై, ఈ నెల 26వ తేదీ వరకు నాలుగు పంపుల ద్వారా నీటి తరలింపు కొనసాగింది. తాజాగా ఆదివారం రోజు 3వ, 7వ, 8వ, 9వ, 10వ, 11వ నంబర్ల పంపులను కూడా ఆన్‌ చేశారు. దీనివల్ల మొత్తం 2,025 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు.