Page Loader
Ponguleti Srinivas Reddy: 16 గంటల పాటు చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
16 గంటల పాటు చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy: 16 గంటల పాటు చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2024
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16 గంటల పాటు చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. మాటలు కాదు చేతల్లో చూపించాలనే ఉద్ధేశంతో తొలి మంత్రి వర్గ సమావేశంలో ఆరు హామీలకు ఆమోదం తెలిపామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఖమ్మం రూరల్ మండలం మంగళదూడెంలో జరిగిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.

Details

పెద్ద మనసు చాటుకున్న పొంగులేటి

ఇదిలా ఉండగా, చింతపల్లి స్టేజీ వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గమనించి, వెంటనే తన కాన్వాయ్ ని పక్కకు ఆపారు. తర్వాత అంబులెన్స్ కి ఫోన్ చేసి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. క్షతగాత్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏమైనా సాయం కావాలంటే తనకు ఫోన్ చేయాలన్నారు. మంత్రి పొంగులేటి క్షతగాత్రులకు ధైర్యం చెప్పడంతో అక్కడున్న వారంతా అభినందనలు తెలిపారు. ఎలాంటి ఆపద వచ్చిన పొంగులేటి స్పందిస్తారని వారు కొనియాడారు.