Page Loader
AP Govt: హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ను అమరావతిలోనే ఉంచుతాం : ఏపీ ప్రభుత్వం
హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ను అమరావతిలోనే ఉంచుతాం : ఏపీ ప్రభుత్వం

AP Govt: హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ను అమరావతిలోనే ఉంచుతాం : ఏపీ ప్రభుత్వం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2024
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ల తరలింపుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది హైకోర్టుకు, హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌లను అమరావతిలోనే ఉంచుతామని చెప్పారు. అదే విధంగా అవసరమైన చట్టసవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఈ విషయంలో తదుపరి విచారణను మూడు నెలల వరకు వాయిదా వేసింది. ఇంతలో ఈ తరలింపుపై మద్దిపాటి శైలజ, ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.