Narendra Modi: అంకితభావంతో పనిచేస్తాం.. దిల్లీ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ప్రజలు 27 ఏళ్లుగా కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనను అనుభవించిన తరువాత ఈసారి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీకి భారీ విజయాన్ని అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, దిల్లీ ఓటర్లకు సెల్యూట్.. బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలంటూ సంతోషం వ్యక్తంచేశారు.
ప్రజల అభివృద్ధి తమ గ్యారంటీ అని మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధి, సుపరిపాలన విజయం సాధించాయని, ఈ విజయానికి కారణమైన ప్రతి కార్యకర్త పట్ల తాను గర్వంగా ఉన్నానని చెప్పారు.
దిల్లీ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు, నగర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని చెప్పారు.
Details
మరింత సేవ చేస్తాం
అంతేకాదు భారత్ అభివృద్ధిలో దిల్లీ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలకు సేవ చేయడం కోసం అంకితభావంతో ముందుకు సాగుతామని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.
70 స్థానాలున్న దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ, దిల్లీ ప్రజలు బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు.
శనివారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో, బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఘన విజయాన్ని సాధించింది.
వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని ఆశించిన ఆమ్‌ఆద్మీ పార్టీకి ఈసారి భంగపాటు ఎదురైంది.