Loading...
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. తెలంగాణలోని ఈ ప్రాంతాలకు అలర్ట్ జారీ
హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. తెలంగాణలోని ఈ ప్రాంతాలకు అలర్ట్ జారీ

Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. తెలంగాణలోని ఈ ప్రాంతాలకు అలర్ట్ జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అక్కడ ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి నుంచి వర్షం జోరందుకుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో కురిసిన వానతో రహదారులపైకి నీరు చేరి జలమయంగా మారాయి. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి 2గంటల నుంచి మొదలైన వర్షం శుక్రవారం ఉదయం కూడా కొనసాగింది. ముఖ్యంగా పశ్చిమ,ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉదయం వేళ వివిధ పనుల కోసం ఇళ్ల నుంచి బయటకు వచ్చినవారు వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు.

వివరాలు 

ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

నగరంలోని అమీర్‌పేట్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, గచ్చిబౌలి, కొండాపూర్, బేగంపేట్, బాలానగర్, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, కూకట్‌పల్లి, కాప్రా, మల్కాజిగిరి ప్రాంతాల్లో వర్షం కురిసింది.

వీటితోపాటు ఉప్పల్, నాగోల్, పెద్ద అంబర్‌పేట్, హయత్‌నగర్ ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి.

శుక్రవారం సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వివరాలు 

తెలంగాణ జిల్లాలకు వర్ష హెచ్చరికలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.

అలాగే విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌ల సమీపంలో ఉండకూడదని సూచించారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

నాగర్‌కర్నూల్‌లో అత్యధిక వర్షపాతం

మరోవైపు గురువారం రాత్రి నుంచి తెలంగాణలోని నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా ముందంజలో నిలిచింది.

ఈ జిల్లాలోని తాడూరు మండలం యంగంపల్లిలో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కల్వకుర్తి మండలం తోటపల్లిలోనూ 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఊర్కొండలో 1.2 సెంటీమీటర్లు, నాగర్‌కర్నూల్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.

ADVERTISEMENT

వివరాలు 

నాగర్‌కర్నూల్‌లో అత్యధిక వర్షపాతం

సంగారెడ్డి జిల్లాలోని 11 వర్షపాతం నమోదు కేంద్రాల్లో వాన కురిసింది. వట్‌పల్లిలో 4 సెంటీమీటర్లు, చౌటకూర్‌లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ జిల్లాలోని షేక్‌పేట మండలం ఫిల్మ్‌నగర్ పరిధిలో గౌతమ్ నగర్ ఫంక్షన్ హాల్ వద్ద 0.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT