ఎమ్మెల్యేలకు మమతా బెనర్జీ బంపర్ బొనాంజా.. ఒక్కొక్కరి జీతం దాదాపు రూ.40 వేలు పెంపు
పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేలకు నెలకు రూ.40 వేల చొప్పున జీతం పెంచుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో గురువారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్ ఎమ్మెల్యేల జీతాలు తక్కువగా ఉన్నందునే పెంచామన్నారు. తాజా పెంపుతో ప్రస్తుతం ఉన్న రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెరగనున్నాయి. మంత్రుల జీతాలు రూ.10,900 నుంచి రూ.50,900కి ఎగబాకనుంది. కేబినెట్ మంత్రుల జీతాలు రూ.11 వేల నుంచి రూ.51 వేలకు పెరగబోతున్నాయి. అన్ని రకాల అలవెన్సులతో కలిపి ఎమ్మెల్యేలకు రూ.1.21 లక్షలు, మంత్రులకు రూ.1.50 లక్షలు చొప్పున కొత్త వేతనాలు లభించనున్నాయి. సీఎం నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి జీతంలో మాత్రం ఎటువంటి మార్పూ లేకపోవడం గమనార్హం.