Page Loader
West Bengal: వైద్య విద్యార్థుల నిరసనలపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానం 
వైద్య విద్యార్థుల నిరసనలపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానం

West Bengal: వైద్య విద్యార్థుల నిరసనలపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2024
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో వైద్య విద్యార్థుల నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జూనియర్‌ వైద్యులకు లేఖ పంపించి, సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని ఆహ్వానించారు. అయితే, వైద్యుల ప్రతినిధుల్లో 30మంది కాకుండా, 15 మంది మాత్రమే చర్చలకు హాజరుకావాలని కోరారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలోనే ఈ చర్చలు జరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే చర్చలను లైవ్‌ టెలికాస్ట్‌ చేయాలన్న వైద్యుల ప్రతిపాదనను తిరస్కరించారు.

Details

నెల రోజులగా ఉథృతంగా నిరసనలు

ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలు దాదాపు నెలరోజులుగా ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆరోగ్యశాఖ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు చర్చలకు రావాలని ఆహ్వానం పంపినా వైద్యులు 30 మంది ప్రతినిధులకు అనుమతించాలని, భేటీని ప్రత్యక్షప్రసారం చేయాలని షరతులు పెట్టారు.