Loading...
Bandi Sanjay: పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు..? కేటీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌!
పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు..? కేటీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌!

Bandi Sanjay: పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు..? కేటీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2026
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. భారత్‌లో మంచి కాలేజీలు లేవని కేటీఆర్‌ అంటున్నారని.. మరి బీఆర్‌ఎస్‌ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంచి పాఠశాలలు, కళాశాలలు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. పదేళ్లపాటు ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. 'స్కూళ్లు బాగాలేవని కొన్నాళ్ల క్రితం కేసీఆర్‌ మనవడు చెప్పారు. ఇప్పుడు కాలేజీలు బాగాలేవని కేసీఆర్‌ మనవరాలు చెబుతోందని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT