Page Loader
#NewsBytesExplainer: మహారాష్ట్రను కుదిపేస్తున్న బిట్‌కాయిన్ స్కామ్.. అసలు ఈ స్కామ్ ఏంటి ? ఏం జరుగుతోంది?
మహారాష్ట్రను కుదిపేస్తున్న బిట్‌కాయిన్ స్కామ్.. అసలు ఈ స్కామ్ ఏంటి ? ఏం జరుగుతోంది?

#NewsBytesExplainer: మహారాష్ట్రను కుదిపేస్తున్న బిట్‌కాయిన్ స్కామ్.. అసలు ఈ స్కామ్ ఏంటి ? ఏం జరుగుతోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2024
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నడుమ బిట్‌ కాయిన్ స్కామ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బీజేపీ సమర్పించిన ఆడియో క్లిప్‌లో తన వాయిస్ లేదని స్పష్టంగా తెలిపారు.

వివరాలు 

ఆరోపణలపై సుప్రియా సూలే స్పందన 

"ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న బీజేపీ ప్రతినిధి సుధాన్షు త్రివేదీపై పరువునష్టం దావా వేస్తాను," అని సుప్రియా పేర్కొన్నారు. బుధవారం ఓటు వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తన లాయర్లను సంప్రదించి, సుధాన్షు త్రివేదీకి నోటీసు పంపినట్టు చెప్పారు. "నన్ను ఎక్కడికి రమ్మన్నా వస్తాను. నాకు ఎటువంటి భయం లేదు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను," అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

వివరాలు 

శరద్ పవార్, అజిత్ పవార్ ఏమన్నారు? 

ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ మాట్లాడుతూ, బీజేపీ అవాస్తవ ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆ ఆడియో క్లిప్‌లలో ఒకటి సుప్రియాకు సంబంధించిందని, కానీ దర్యాప్తు అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

వివరాలు 

అసలేంటి బిట్ కాయిన్ స్కామ్?

ఈ వివాదం 2018 నాటి బిట్‌కాయిన్ స్కామ్‌కు సంబంధించినది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సుప్రియా సూలే, నానా పటోలేలపై ఆరోపణలు చేస్తూ, ఈ కేసులో వచ్చిన డబ్బు ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారని విమర్శలు చేసింది. బీజేపీ విడుదల చేసిన ఆడియో క్లిప్‌లు, చాట్‌లు ఈ ఆరోపణల కింద వచ్చాయి. మాజీ ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్ పాటిల్ తనకు 2018లో కేసు దర్యాప్తు సమయంలో క్రిప్టో నిపుణుడిని నియమించుకున్నానని, కానీ 2022లో తాను తప్పుడు ఆరోపణలతో అరెస్టు అయ్యానని తెలిపారు.

వివరాలు 

సుప్రియా సూలే, ఇతర కాంగ్రెస్ నేతల పాత్రపై బీజేపీ ఆరోపణలు

బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేదీ, బిట్‌కాయిన్ స్కామ్‌కు సంబంధించి సుప్రియా సూలే, ఇతర కాంగ్రెస్ నేతల పాత్రపై పలు ఆరోపణలు చేశారు. అయితే సుప్రియా సూలే ఈ ఆరోపణలను తూర్పారబట్టారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా మారింది, దీనిపై మరింత స్పష్టత వచ్చే వరకు వివాదం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీ చేసిన ట్వీట్