
Subhadra Yojana: ప్రధాని మోదీ బర్తడే గిఫ్ట్.. ఒడిశా మహిళలకు సుభద్ర యోజనతో ఆర్థిక సాయం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ తన 74వ పుట్టినరోజు సందర్భంగా ఒడిశా మహిళలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.
ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన "సుభద్ర యోజన" పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీని ద్వారా రాష్ట్రంలోని కోటి మంది మహిళల ఖాతాల్లో ఏడాదికి రూ. 10 వేలు జమ కానున్నాయి.
సుభద్ర యోజన ద్వారా ఒడిశా మహిళలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. రాష్ట్రంలోని మహిళలకు సంవత్సరానికి రూ.10 వేలు, ఆ మొత్తాన్ని రెండు విడతలుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
Details
రెండు విడతలగా నగదు జమ
రాఖీ పూర్ణిమ (ఆగస్టు), అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) నాటికి ఈ మొత్తాన్ని రెండు విడతలుగా అందజేయనున్నారు.
జగన్నాథుడి సోదరి సుభద్ర దేవిని ఒడిశా ప్రజలు ఎంతో గౌరవిస్తారు. అందుకే, ఈ పథకానికి సుభద్ర యోజన అనే పేరు పెట్టారు.
21 నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న అర్హులైన మహిళలు ఈ పథకానికి అర్హులవుతారు.
ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా నెలకు రూ. 18,000 పైగా సంపాదిస్తున్న మహిళలు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించారు.
Details
ఐదేళ్ల పాటు పథకం అమలు
2024-25 నుండి 2028-29 వరకూ ఐదేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కార్యక్రమం ద్వారా మంగళవారం నాటికి 10 లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ అయింది.
ఈ పథకం కోసం ఒడిశా ప్రభుత్వం రూ. 55,825 కోట్లను కేటాయించింది. సభ్యులు కనీసం 21 సంవత్సరాల వయస్సు నుండి 60 ఏళ్ల వయస్సులో ఉండాలి.