Page Loader
Saif-Rahul Gandhi: రాహుల్ గాంధీ నిజాయితీ గల రాజకీయ నేత:సైఫ్ అలీ ఖాన్  
రాహుల్ గాంధీ నిజాయితీ గల రాజకీయ నేత:సైఫ్ అలీ ఖాన్

Saif-Rahul Gandhi: రాహుల్ గాంధీ నిజాయితీ గల రాజకీయ నేత:సైఫ్ అలీ ఖాన్  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ ప్రశంసలు కురిపించారు. రాహుల్‌ గాంధీ ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో తన ఇమేజ్‌ను మెరుగుపరచుకోవడానికి రాహుల్‌ తనను తాను చాలా మార్చుకున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా వేదికలో వచ్చినట్లు వెల్లడైంది. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకుల గురించి చర్చ జరుగగా,'మీకు ఎలాంటి నాయకుడిని ఇష్టపడతారు?' అంటూ వ్యాఖ్యాత అడిగారు

వివరాలు 

రాహుల్ ప్రజల్లో ఆదరణ చూరగొనేందుకు చాలా కష్టపడ్డారు

దీనికి సమాధానంగా సైఫ్‌, "ధైర్యంగా,నిజాయతీగా ఉండే రాజకీయ నాయకులు అంటే ఇష్టమని చెప్పారు . " ఆ సమయంలో వ్యాఖ్యాత కొన్ని పేర్లు ప్రస్తావించారు."ప్రధాని మోదీ,దిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ"లో ఎవరిని ఎంపిక చేస్తారు అని అడిగారు. దీనిపై సైఫ్‌ స్పందిస్తూ, "వాళ్లంతా ధైర్యవంతులైన నాయకులు. కానీ, రాహుల్‌ గాంధీ తీరు నాకు మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుంది.గతంలో ఆయన చేసే పనులను,చెప్పే మాటలను కొందరు అగౌరవించిన సందర్భాలు ఉన్నాయి.అలాంటి పరిస్థితి నుంచి ఆయన తనను తాను చాలా మార్చుకున్నారు.ప్రజల్లో ఆదరణను పొందడానికి ఆయన చాలా కష్టపడ్డారు.ఆ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది"అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు 

'దేవర' సినిమాలో భైర‌ పాత్రలో సైఫ్‌

ఇటీవల 'దేవర' సినిమాలో భైర‌ పాత్రలో సైఫ్‌ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ అడ్డు తొల‌గించి సంద్రాన్ని శాసించాల‌నుకొనే పాత్రలో ప్రేక్షకులను అక్కటుకొన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలై పాజిటివ్‌ స్పందనను పొందింది. ఎన్టీఆర్‌,సైఫ్‌ మధ్య యాక్షన్‌ సన్నివేశాలను మరో స్థాయిలో ఉన్నాయనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.