
MLA MS Babu: నేను చేసిన తప్పేంటి.. సీఎం జగన్‌పై మరో ఎమ్మెల్యే తిరుగుబాటు!
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ వేడి పెరుగుతోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన నాయకులు అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు.
తమకు సీటు దక్కదని భావించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్క పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీ పార్టీని వీడారు.
తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్(MS Babu) బాబు కూడా సీఎం జగన్(CM Jagan) తీరుపై మండిపడ్డారు.
పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నానని, ఇప్పుడు నాపై వ్యతిరేకత వస్తే తప్పు ఎలా అవుతుందని ఎంఎస్ బాబు ప్రశ్నించారు.
Details
ఓసీ సీట్లు మార్చకుండా ఎస్సీ సీట్లు మార్చడం సరికాదు
ఐప్యాక్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని, ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం అన్యాయమన్నారు.
ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని, పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు.
ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గౌరవం ఉందని, ఆయన న్యాయం చేస్తారని అశిస్తున్నానని చెప్పారు.
ఓసీ సీట్లు ఒక్క చోట మార్చకుండా కేవలం ఎస్సీ సీట్లే మార్చడం సరికాదని ఎంఎస్ బాబు మండిపడ్డారు.