
PM Modi: బీడీలతో ముడిపెట్టడం బిహారీలకు అవమానం.. విపక్ష కూటమికి ప్రజలు ఎన్నికల్లో బదులిస్తారు: మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ ప్రజలను బీడీలతో పోల్చి అవమానించడానికి విపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలకు ప్రజలు తగిన బదులివ్వడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం బీహార్‌లో రూ.40 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ, శంకుస్థాపనలు చేశారు. పూర్ణియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కేరళ కాంగ్రెస్ నేతలు పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ గురించి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, తర్వాత వాటిని తొలగించడం గురించి మోదీ ప్రస్తావించారు.
వివరాలు
నేను సబ్‌కా సాథ్, సబ్‌కా విశ్వాస్ అనే సూత్రాన్ని నమ్ముతున్నాను: మోదీ
''కొందరు కాంగ్రెస్ నేతలు బీడీ, బీహార్ అనే రెండు పదాలు 'బీ' అక్షరంతో మొదలవుతాయని చెప్పడం ద్వారా అవమానం కలిగిస్తున్నారు. ఇది బీహార్ రాష్ట్రానికి,ఇక్కడి ప్రజలకు తీరని అవమానం. గతంలో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ఇక్కడ దుష్పరిపాలన నిర్వహించింది. ఓట్ల కోసం రాష్ట్రంలో విదేశీచొరబాటుదారులకు అవకాశాలు కల్పించాయి. బీహార్‌తో పాటు అస్సాం, బెంగాల్‌లోనూ జనాభా సంబంధిత మార్పులకు కారణమయ్యాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ నేతలకు వారి కుటుంబాలు మాత్రమే ముఖ్యమే. కానీ నేను సబ్‌కా సాథ్, సబ్‌కా విశ్వాస్ అనే సూత్రాన్ని నమ్ముతున్నాను'' అని మోదీ చెప్పారు.
వివరాలు
ఇకపై ఎప్పటికీ ఎన్డీయేలోనే..
ప్రభుత్వం పంపే రూపాయిలో 15 పైసలే పేదలకు చేరేవని కాంగ్రెస్ ప్రధాని ఒకరు అంగీకరించారని, మిగిలిన 85 పైసలను.. 'లాంతరు పట్టుకున్న హస్తం' మింగేసేదని కాంగ్రెస్, ఆర్జేడీలను మోడీ విమర్శించారు. ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ, కొద్దిరోజులు ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో ఉన్నందుకు విచారిస్తున్నానని, భవిష్యత్తులో ఎప్పటికీ ఎన్డీయే లోనే కొనసాగుతానని ప్రధానికి తెలిపారు.