Page Loader
KL Sharma: అమేథీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీకి నిలబడిన కేఎల్ శర్మ ఎవరు? 
అమేథీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీకి నిలబడిన కేఎల్ శర్మ ఎవరు?

KL Sharma: అమేథీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీకి నిలబడిన కేఎల్ శర్మ ఎవరు? 

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2024
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ అమేథీ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది.ఈసారి అమేథీలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ కేఎల్ శర్మను అమేథీ నుంచి అభ్యర్థిగా నిలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే అమేథీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చిన కేఎల్‌ శర్మ ఎవరనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. అసలు ఇప్పుడు ఆయన ఎవరో తెలుసుకుందాం..

Details 

రాజీవ్ గాంధీ కుటుంబానికి కూడా విధేయుడిగా..

కిషోరి లాల్ శర్మ వాస్తవానికి పంజాబ్‌లోని లూథియానాకు చెందినవారు. 1983లో రాజీవ్ గాంధీ ఆయనను మొదటిసారిగా అమేథీకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అయన ఇక్కడే ఉంటున్నాడు. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం గాంధీ కుటుంబం ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం మానేసినప్పటికీ శర్మ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పని చేస్తూనే ఉన్నారు. అయన సంస్థకు మాత్రమే కాకుండా కుటుంబానికి కూడా విధేయుడిగా పరిగణించబడ్డాడు. సోనియా గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా ఎన్నికైన తర్వాత, ఆమె ప్రతినిధిగా పని చేశారు. సోనియా గాంధీ ఎన్నికలలో పోటీ చేయనప్పుడు, కిషోరిని రాయ్‌బరేలీ నుండి పోటీదారుగా పరిగణించారు. కాని పార్టీ అయనను రాయ్‌బరేలీకి బదులుగా అమేథీ నుండి అభ్యర్థిని చేసింది.