
Vasundhara Oswal: ఉగాండాలో నిర్బంధంలో ఉన్న బిలియనీర్ కుమార్తె.. వసుంధర ఓస్వాల్ ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ (26) ఉగాండాలో అక్రమంగా అరెస్టయ్యారు.
ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 1నుంచి ఉగాండా పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో, పంకజ్ ఓస్వాల్ తన కుమార్తె నిర్బంధానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో అప్పీల్ దాఖలు చేశారు.
ఉగాండా అధ్యక్షుడికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో, వసుంధర ప్రాథమిక హక్కులు, న్యాయపరమైన ప్రాతినిధ్యం, ఆమె కుటుంబంతో సంబంధాలను నిరాకరించడం గురించి పేర్కొన్నారు.
వసుంధర ఓస్వాల్ ఉగాండాలోని ఓస్వాల్ గ్రూప్ ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ENA) ప్లాంట్‌ను సందర్శిస్తున్న క్రమంలో అరెస్టయ్యారు.
వివరాలు
అరెస్ట్ వివరాలు
ఆ సమయంలో, గుర్తింపు కార్డు లేకపోయినా, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా నటిస్తున్న సాయుధ వ్యక్తులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నిర్బంధ సమయంలో, కంపెనీ లాయర్ రీటా నాగబయార్‌తో సహా వసుంధర సహచరులు కూడా అరెస్టయ్యారు.
వసుంధరపై నేరారోపణలు, ఆర్థికపరమైన నేరాలు వంటి పలు ఆరోపణల కింద అదుపులోకి తీసుకున్నారు.
పంకజ్ ఓస్వాల్ యునైటెడ్ నేషన్స్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఆర్బిట్రరీ డిటెన్షన్ (WGAD)కి అప్పీల్ దాఖలు చేశారు, వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
వివరాలు
వసుంధర ఓస్వాల్ గురించి
వసుంధర ఓస్వాల్ భారతీయ బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె. 1999లో జన్మించిన వసుంధర బాల్యం భారతదేశం, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లో గడిపింది.
వసుంధర స్విస్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్‌లో ఆనర్స్ పట్టభద్రురాలైంది. ఆమె ప్రో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.
ఓస్వాల్ గ్రూప్ గ్లోబల్ బిజినెస్‌లో భాగంగా ఉంది, అలాగే PRO ఇండస్ట్రీస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె తండ్రి పంకజ్ ఓస్వాల్ భారతదేశంలో కూడా వ్యాపారాన్ని విస్తరించారు.
వివరాలు
వసుంధర తల్లి విజ్ఞప్తి
వసుంధర తల్లి రాధిక ఓస్వాల్, తన కూతురితో మాట్లాడేందుకు అనుమతించాలని ఉగాండా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆమె, తన చిన్న కుమార్తెకు విదేశాలలో జైలు శిక్ష విధించబడిందని చెప్పారు. మానవ హక్కుల న్యాయవాది చెర్రీ బ్లెయిర్ వసుంధర కేసును స్వీకరించారు.
వసుంధర "ఇంటికి దూరంగా" బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొంటున్నారని బ్లెయిర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో, ఆమెకు శాఖాహారం లేకపోవడం, నోటీసు లేకుండా అరెస్టు చేయడం, అపరిశుభ్రమైన పరిస్థితులను ఎదుర్కోవడం వంటి అమానవీయ పరిస్థితుల గురించి ఆమె కుటుంబ న్యాయ బృందం ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
ఖరీదైన ఆస్తి కొనుగోలు
పంకజ్ ఓస్వాల్, రాధిక ఓస్వాల్ ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఈ ఆస్తి స్విట్జర్లాండ్‌లోని గిన్జిన్స్‌లో ఉంది.
ఇది అంతకముందు గ్రీకు షిప్పింగ్ మాగ్నెట్ అరిస్టాటిల్ ఒనాసిస్ కుమార్తె క్రిస్టినా ఒనాసిస్ ఆస్తి.
వారు ఈ ఆస్తిని 200 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1,649 కోట్లు)కు కొనుగోలు చేశారు.
వసుంధర ఓస్వాల్ అరెస్ట్ కేసు కుటుంబంలోనే కాకుండా, మానవ హక్కులు,విదేశీ సంబంధాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొన్ని ఉగాండా మీడియా నివేదికలు చెఫ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో వసుంధర ఓస్వాల్‌ను అరెస్టు చేసినట్లు చెబుతున్నాయి, అయితే మరికొన్ని ఆమె మోసం, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నాయి.