NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'జాతీయ సివిల్ సర్వీసెస్ డే 2023'ను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యతను తెలుసుకోండి 
    'జాతీయ సివిల్ సర్వీసెస్ డే 2023'ను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యతను తెలుసుకోండి 
    భారతదేశం

    'జాతీయ సివిల్ సర్వీసెస్ డే 2023'ను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యతను తెలుసుకోండి 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 21, 2023 | 05:30 am 1 నిమి చదవండి
    'జాతీయ సివిల్ సర్వీసెస్ డే 2023'ను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యతను తెలుసుకోండి 
    'జాతీయ సివిల్ సర్వీసెస్ డే 2023'ను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యతను తెలుసుకోండి

    ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్(IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్(IFS) భారతదేశంలోని సివిల్ సర్వీసెస్‌లో భాగం. ఈ మూడు విభాగాల అధికారులను సివిల్ సర్వెంట్లు అంటారు. సివిల్ సర్వెంట్స్ పౌరులకు సేవలను అందించేందుకు తమను తాము అంకితం చేసుకుంటారు. ప్రతి ఏటా ఏప్రిల్ 21న 'జాతీయ సివిల్ సర్వీసెస్ డే'ను ఎందుకు జరుపుకుంటారు? దాని ప్రాముఖ్య ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. సివిల్ సర్వెంట్లు ఏ రాజకీయ పార్టీకి బాధ్యులుగా ఉండరు. కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ విధానాలను అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తారు. సివిల్ సర్వెంట్లు వారి ఆదర్శప్రాయమైన సేవలను స్మరించుకోవడానికి, రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఏప్రిల్ 21ని ఒక వేదికగా చేసుకుంటారు.

    జాతీయ పౌర సేవల దినోత్సవం చరిత్ర ఇదే 

    సివిల్ సర్వీస్ పదం బ్రిటిష్ కాలం నాటిది. ఈస్ట్ ఇండియా కంపెనీ పౌర సిబ్బంది, పరిపాలనా ఉద్యోగులను నియమించుకునేవారు. వారిని 'పబ్లిక్ సర్వెంట్స్' అని పిలిచేవారు. 'పబ్లిక్ సర్వెంట్స్' వ్యవస్థను బ్రిటన్ పాలనలో వారెన్ హేస్టింగ్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవస్థలో 'చార్లెస్ కార్న్వాలిస్' అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అందుకే కార్న్వాలిస్‌ను 'భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు' అని పిలుస్తారు. 1947లో దిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ప్రబేషనరీ అధికారులను ఉద్దేశించి భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏప్రిల్ 21న ప్రసంగించారు. ఆ రోజు జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా సివిల్ సర్వీసెస్ డేను ఏప్రిల్21న నిర్వహిస్తున్నారు. ఆ రోజున సివిల్ సర్వెంట్లను 'స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా'గా పటేల్ పేర్కొన్నారు.

    ఈ రోజున ఏం చేస్తారు?

    జాతీయ పౌర సేవల దినోత్సవం నాడు ప్రజా సేవలో గణనీయమైన కృషి చేసిన సివిల్ సర్వెంట్లను ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు భారత ప్రధాన మంత్రి అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్‌ను అందజేస్తారు. పౌరులకు ఉత్తమంగా సేవలను అందించిన సివిల్ సర్వెంట్లను సత్కరిస్తారు. సీనియర్లు వారి అనుభవాలను పంచుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్తమంగా పని చేసిన అధికారులను ప్రశంసా పత్రాలను అందజేస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అవార్డుల కార్యక్రమం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ (డీఏఆర్‌పీజీ), మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    భారతదేశం
    కలెక్టర్
    తాజా వార్తలు

    భారతదేశం

    మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు పాకిస్థాన్
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ చైనా
    Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా? మిజోరం
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు

    కలెక్టర్

    యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా భారతదేశం
    20 మందిని గాయపర్చిన మోస్ట్ వాంటెడ్ మంకీ నిర్బంధం.. అటవీశాఖకు రూ.21 వేల రివార్డు మధ్యప్రదేశ్

    తాజా వార్తలు

    బోయపాటి సినిమాలో 1500 ఫైటర్స్‌తో రామ్ పోతినేని యాక్షన్ సినిమా
    ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు; నలుగురు జవాన్లు మృతి  జమ్ముకశ్మీర్
    'బలగం' సినిమాకు ఆగని అవార్డుల పరంపర; మరో మూడు అంతర్జాతీయ పురస్కారాలు సినిమా
    గేమ్ ఛేంజర్ క్లైమాక్స్: 1200మంది ఫైటర్లతో కళ్లు చెదిరిపోయేలా రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్ రామ్ చరణ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023