Shimla: సిమ్లాలో మునిగిపోతున్న కొండలు.. భౌగోళిక పరిస్థితులే కారణమంటున్న నిపుణులు
భారతదేశం లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం 'సిమ్లా'. ప్రస్తుతం భౌగోళిక సవాళ్లను ఎదుర్కొంటోంది. కొండచరియలు విరిగిపడటం, భూమి క్షీణత పెరుగుదలతో కొండలు కనుమరుగు అవుతున్నాయి. సిమ్లాలో గతేడాది వరదల తర్వాత, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సిమ్లా భూభాగం భద్రతపై సమగ్ర పరిశోధన ప్రారంభించారు. ఈ పరిశోధనలో సిమ్లాలోని కొండల రాతి పొరలు, వాటి బలహీనతపై చర్చించారు. నీటి ఊట, రాతి పొరలు బలహీనపడటం, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాల్లో, కొండ చరియలు విరిగిపడే ప్రమాదాలు ఉన్నట్లు హెచ్చరీకలు జారీ చేశారు.
రాతి పొరలు క్షీణించడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి
ఉపరితల నీటి నిర్వహణ, క్రమబద్ధమైన నీటి నియంత్రణ ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సిమ్లా భౌగోళిక సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే, రాబోయే కాలంలో నగరం తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏటా కొండల్లోని రాతి పొరలు క్షీణించి, నీటి ఊటతో పాటు, అధిక భారం కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. డాక్టర్ SS రాంధావా నేతృత్వంలో చేపట్టిన సర్వేలో సిమ్లాలోని కామ్లీ బ్యాంక్ ప్రాంతం, ఎంఎల్ఏ క్రాసింగ్, శివ్ బావోరి ప్రాంతాల్లో రాతి ఉపరితలంపై అధిక భారం కారణంగా మునిగిపోవడానికి ఆస్కారం ఉందన్నారు
జనాభా పెరుగల కారణంగా భూభౌగోళిక సమస్యలు
. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి క్రమబద్ధమైన ఉపరితల నీటి నిర్వహణ అవసరమని రాంధావా సూచిస్తున్నారు. సిమ్లా నగరం వాస్తవంగా 30,000 మంది మాత్రమే నివసించాలి. ఇప్పుడు 300,000 మందికి పైగా జనాభా ఉన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభా కారణంగా భూభౌగోళిక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది.