Page Loader
Why Planes Crash: విమాన కూలిపోడానికి గల కారణాలు ఏమిటి? ప్రమాదాలకు 4 ప్రధాన కారణాలు ఇవే..!
విమాన కూలిపోడానికి గల కారణాలు ఏమిటి? ప్రమాదాలకు 4 ప్రధాన కారణాలు ఇవే..!

Why Planes Crash: విమాన కూలిపోడానికి గల కారణాలు ఏమిటి? ప్రమాదాలకు 4 ప్రధాన కారణాలు ఇవే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
07:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం AI-171 కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమాన సిబ్బంది సహా మొత్తం 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనతో విమాన ప్రయాణాల భద్రతపై, అలాగే సాంకేతిక లోపాలపై గాఢమైన చర్చలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతాయన్న ప్రశ్నకు నిపుణులు ప్రధానంగా నాలుగు కారణాలు చెబుతున్నారు. మొదటిగా, సాంకేతిక లోపాలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. చాలా సందర్భాల్లో విమానాలు సాంకేతిక కారణాలతోనే కూలిపోతున్నాయి. ముఖ్యంగా ఇంజిన్‌లో వైఫల్యం, నావిగేషన్ వ్యవస్థలో సమస్యలు, ల్యాండింగ్ గేర్ లేదా రెక్కలలో లోపాలు వంటి వాటి వల్ల విమాన నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయి.

వివరాలు 

పైలట్, కంట్రోల్ రూమ్ మధ్య కమ్యూనికేషన్

రెండవ కారణంగా, మానవ తప్పిదాలు బాధ్యత వహిస్తున్నాయి. పైలట్‌లు తీసుకునే తప్పు నిర్ణయాలు, లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో నిర్లక్ష్యం వంటి వాటి వల్ల కూడా గతంలో ఎన్నో విమానాలు కూలిపోయాయి. అలాగే, అనుభవం లేని పైలట్ల వల్ల విమానాన్ని సక్రమంగా నడపలేకపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే, సాంకేతిక సిబ్బంది చేసిన చిన్న తప్పిదాల వల్ల కూడా ప్రమాదాలు సంభవించవచ్చు. ఉదాహరణకు.. విమానానికి సరిపడా ఇంధనం నింపకపోవడం, టైర్ల ఒత్తిడిని సరిగా తనిఖీ చేయకపోవడం లాంటి అంశాలు ప్రమాద కారకంగా మారుతాయి. పైలట్, కంట్రోల్ రూమ్ మధ్య కమ్యూనికేషన్ బంధం తెగిపోవడం కూడా ఒక ప్రధాన ప్రమాదానికి దారితీయగలదు.

వివరాలు 

వాతావరణ పరిస్థితులు

చివరగా, వాతావరణ పరిస్థితులు కూడా విమాన ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలుస్తున్నాయి. నిపుణుల ప్రకారం.. బలమైన తుఫానులు, మెరుపులు, కుంభవృష్టి, వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు వంటివి విమానం నియంత్రణ కోల్పోయే పరిస్థితులను తెచ్చిపెడతాయి. అలాంటి సందర్భాల్లో ప్రమాదం తప్పదు.