Page Loader
Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే!
ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే!

Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే!

వ్రాసిన వారు Stalin
Jul 18, 2023
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత నావికా దళానికి 26రాఫెల్ విమానాలు, మూడు స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌ల ఒప్పందాలపై భారత్- ఫ్రాన్స్ మధ్య తర్వలో చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతవారం ఫ్రాన్స్‌పర్యటనకు వెళ్లారు. మోదీ పర్యటన సందర్భంగా పారిస్‌లో విడుదల చేసిన భారత్-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటనలో ఈ ఒప్పందాల గురించి ప్రస్తావన ఉంటుందని అందరూ ఊహించారు. కానీ 26 రాఫెల్ విమానాల గురించి ప్రస్తావించలేదు. మోదీ పారిస్ పర్యటన వేళ భారత్-ఫ్రాన్స్ మధ్య 25ఏళ్ల ద్వైపాక్షిక వార్షికోత్సవం కూడా పూర్తయింది. ఈ క్రమంలో ఇరు దేశాలు రాబోయే 25ఏళ్లకు రోడ్‌మ్యాప్‌ను ప్రకటించాయి. రాఫెల్ డీల్ అనేది రాబోయే 25ఏళ్ల రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఉందని, అందుకే అప్పుడు ప్రకటించలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

రాఫెల్ డీల్

కొత్త తరం సైనిక పరికరాల సంయుక్త అభివృద్దికి భారత్- ఫ్రాన్స్ అంగీకారం: ఫ్రెంచ్‌ రాయబారి 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలి పారిస్‌ పర్యటన సందర్భంగా దీర్ఘకాలిక సహకారంతో కొత్త తరం సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు భారత్‌, ఫ్రాన్స్‌లు అంగీకరించాయని భారత్‌లోని ఫ్రెంచ్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనైన్‌ మంగళవారం తెలిపారు. ఈ విధానాన్ని రెండు దేశాల మధ్య విశ్వాసం, బలమైన మైత్రికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు. ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ విమానాలు, మూడు స్కార్పెన్ క్లాస్ సాంప్రదాయ జలాంతర్గాములను కొనుగోలు చేసే ప్రణాళికను మోదీ ఫ్రాన్స్ పర్యటన సమయంలోనే రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఒప్పందాన్ని సకాలంలో పూర్తి చేయడానికి ఇరు దేశాల అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లండిచాయి.