
Ranga Reddy: ప్రియుడు కోసం భర్త ప్రాణాలు తీసిన భార్య
ఈ వార్తాకథనం ఏంటి
రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఘోర ఘటన చోటు చేసుకుంది.
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.
పోలీసుల ప్రకారం, దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ప్రమీల దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రమీల ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది.
ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
Details
పోలీసుల అదుపులో భార్య, ప్రియుడు
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ప్రమీల తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నీ ప్రవీణ్‌ను ఉరివేసి హత్య చేశారు.
అనంతరం ఇది ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ప్రవీణ్ తల్లిదండ్రులు, గ్రామస్థులకు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న కందుకూరు పోలీసులు ప్రమీలను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.
ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.