Amaravati: అమరావతి మళ్లీ ఊపందుకోనుందా? నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి ఈ పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల కారణంగా టెండర్ల ఖరారు ఆలస్యమైనప్పటికీ, తాజాగా టెండర్లు పిలవొచ్చని అయితే ఖరారు చేయకూడదని ఆదేశాలు ఇచ్చారు.
టెండర్ల ప్రక్రియ, పనుల వివరాలు
ఇప్పటివరకు ఏపీ సీఆర్‌డీఏ, ఏడీసీ సంయుక్తంగా 62 పనులకు టెండర్లు పిలిచాయి. సుమారు రూ. 42 వేల కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
త్వరలోనే మరో 11 పనులకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి 30 వేల మంది కార్మికులు అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
Details
కేంద్ర నిధులతో అమరావతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.
కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులను కేటాయిస్తూ, రాజధాని నిర్మాణానికి పూర్తి మద్దతు ప్రకటించారు.
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కేంద్ర సహకారంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది.
ఇప్పటికే కేంద్ర మద్దతుతో పలు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.
ఈ పరిణామాలతో, రాజధాని నిర్మాణానికి కొత్త ఉత్సాహం నెలకొంది. పనులు వేగంగా కొనసాగి, అమరావతి గ్లోబల్ సిటిగా రూపుదిద్దుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది.