
KTR Padayatra : కేటీఆర్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో అధికార మార్పు అనంతరం రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా, దశాబ్దకాలం పాలించిన బీఆర్‌ఎస్ ప్రతిపక్ష బాట పట్టింది.
కాంగ్రెస్ పాలనపై మొదట్లో సంయమనంతో ఉన్న బీఆర్‌ఎస్, ఆరు నెలల అనంతరం తన వ్యూహాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించిన కీలక అంశాలపై విపక్షంగా గట్టి పోరాటం ప్రారంభించింది.
హైడ్రో బాధితుల నుండి లగచర్ల వరకు ప్రజలతో కలిసే కార్యాచరణను బలంగా అమలు చేస్తూ, ప్రజాసమస్యలపై పోరాటం ముమ్మరం చేసింది.
వివరాలు
బీఆర్‌ఎస్ దూకుడు… ప్రతిపక్షంగా చురుకైన ప్రదర్శన
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్టుగా బీఆర్‌ఎస్ ప్రజల్లో మద్దతును కూడగట్టేందుకు కృషి చేస్తోంది.
పార్టీ అధినేత కేసీఆర్ అనంతరం కీలక నేతలుగా ఉన్న హరీశ్ రావు, కేటీఆర్ ముందుండి పోరాటాన్ని నడిపిస్తున్నారు.
అవసరమైన చోట ఒకరు, మరొక చోట మరొకరు కార్యాచరణను ముందుండి నడిపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
వివరాలు
తదుపరి ఎన్నికలపై బీఆర్‌ఎస్ లక్ష్యం
గత పదేళ్లపాటు పాలనలో ఉన్న బీఆర్‌ఎస్, తిరిగి అధికారాన్ని అందుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది.
ఇందుకోసం రాజకీయ వ్యూహాలను మెరుగుపరుచుకుంటూ, పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తోంది.
రాబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది.
లక్షలాదిమంది కేడర్‌ను కలిపి, పార్టీకి మరింత బలం చేకూర్చే విధంగా వ్యూహాలు రచిస్తోంది.
వివరాలు
కేటీఆర్ పాదయాత్ర… కీలక ప్రకటన
పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సూర్యాపేట జిల్లాలో పర్యటించి, పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది.
నాటి వైఎస్సార్ నుండి నేటి రేవంత్ రెడ్డి వరకూ రాజకీయ నేతలు విజయాల్ని సాధించడంలో పాదయాత్రలు ప్రధాన పాత్ర పోషించాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రలు నిర్వహించగా, ఆంధ్రప్రదేశ్‌లో నారా లోకేష్ దీర్ఘకాల పాదయాత్ర చేపట్టారు.
చివరికి, ఆ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగా, తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది.
వివరాలు
కేటీఆర్ లక్ష్యం - బీఆర్‌ఎస్ అధికార రీ-ఎంట్రీ
కేటీఆర్ ప్రకటించిన పాదయాత్ర రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.వచ్చే ఏడాది నాటికి కాంగ్రెస్ పాలన రెండేళ్లు పూర్తవుతుండగా,ఆసమయానికి బీఆర్‌ఎస్ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.
బీఆర్‌ఎస్ గత పాలనలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు,కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్న వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కేటీఆర్ పాదయాత్రను వేదికగా ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది.
పాదయాత్ర ద్వారా ప్రజల్లో మరింత సానుభూతిని సంపాదించేందుకు బీఆర్‌ఎస్ యత్నిస్తోంది.
వచ్చేఎన్నికలకు ముందు పార్టీ శ్రేణులను సమీకరించుకోవడంతో పాటు,బలమైన మద్దతును నిలుపుకునేందుకు వ్యూహాలను రూపొందిస్తోంది.
పార్టీవర్గాల్లో వినిపిస్తున్న విశ్లేషణ ప్రకారం,కేటీఆర్ పాదయాత్ర ద్వారా బీఆర్‌ఎస్ గెలుపుఅవకాశాలు మెరుగుపడతాయని అంచనా వేస్తున్నారు.
గతంలో ఐటీ శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నకేటీఆర్,ప్రజల్లో ప్రత్యక్షంగా కలిసిపోతే తన ప్రభావం మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.